ఓం నమో వేంకటేశాయ!
'వేంకటాద్రి సమః స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి'
హిందూ ధర్మ ప్రచారానికి, తిరుపతి పుణ్యక్షేత్రం ఒక పవిత్రమైన వేదికగా, కేంద్రంగా, విరాజిల్లుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానములు అకుంఠిత దీక్ష తో, హిందూ ధర్మ ప్రచారానికి, ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి, దిగ్విజయంగా, అనేక కార్యక్రమాలు, నిర్వహిస్తూ సాగుతున్నది. తిరుపతి లో అనేక సత్సంగాలు, యథాశక్తి గా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మార్గ దర్శకత్వంలో, వారు నెలకొల్పిన, 'వికాస తరంగిణి ' అనే సేవా సంస్థకు, తిరుపతి శాఖ అధ్యక్షుడి గా వ్యవహరించిన శ్రీమాన్ నాదెళ్ల నాగేంద్ర సాయి గారు, తమ ధర్మపత్ని హేమలత గారి తో కలిసి కొన్ని సంవత్సరాలు, అనేక ధార్మిక, సేవ కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించటం జరిగినది. శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు, తి.తి.దే. డిగ్రీ కళాశాల S.V.Arts కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసారు.
దేశ, విదేశాలలో ఉన్న సత్సంగములను సమైక్య పరిచి ధర్మ ప్రచార కార్యక్రమాలని విస్తృతంగా నిర్వహించాలనే సంకల్పంతో వెలోషియస్ సొల్యూషన్స్,హైదరాబాద్ వారి సౌజన్యం తో ఈ వెబ్ సైట్ కు రూపకల్పన జరిగింది .ప్రస్తుతం ఈ వెబ్ సైట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి .
ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముందుగా ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన సభ్యులకు ఒక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది. మీరు చేసే పారాయణముల సంఖ్య ప్రతి నెల 15 మరియు 30వ తేదీలలో పైన చూపబడుతున్న సూచికలలో సంబంధిత పారాయణ సంఖ్య ను వేయవలసింది గా కోరుతున్నాము. పారాయణములలో పాల్గొంటున్న భక్తుల గోత్ర నామాలతో పూజలు, హోమములు నిర్వహించబడతాయి. తదుపరి మనమందరం చేసిన పారాయణముల సమిష్ఠి సంఖ్య ఎల్లరుకు ప్రకటించబడుతుంది.
ఈ కార్యక్రమమాలలో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము గాని విరాళాలు గాని అవసరం లేదు. ప్రస్తుతం దేశ విదేశాల లో ని భక్తులు, శ్రీశైల దేవస్థానం దసర సమయంలో నిర్వహించే చండీయాగం సందర్భంలో సమర్పణ కావించటానికి గాను లలిత సహస్ర నామ కోటి పారాయణం జరుగుతున్నది. మరియు అయోధ్య రామాలయ శంకుస్థాపన ముహూర్తం నుండి నామ రామాయణం పారాయణం మరియు హనుమాన్ చాలీసా పారాయణం ఈ వెబ్సైటు ద్వారా భక్తులు అసంఖ్యాకముగ చేస్తున్నారు.
గతం లో నిర్వహించిన ధార్మిక, సేవా కార్యక్రమాలు -
--తిరుచానూరు లో అష్ట లక్ష్మీ సమేత విష్ణు యాగం మరియు లక్ష దీపోత్సవం
--గీతా జయంతి సందర్భంగా , తిరుమల ఆస్థాన మండపం లో భగవద్గీత పారాయణం
--తిరుపతి నగరం లో, సుమారు 250 గృహాల లో భక్త బృందం చే భగవద్గీత 18 అధ్యాయములు పారాయణం
--ఓం నమో వేంకటేశాయ లేఖనము - 5 కోట్లు.
--శ్రీ వేంకటేశ్వర స్వామి శరణాగతి దీక్ష విరమణ సందర్భముగా 15000 మంది తో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు తిరుమల కు చేసిన పాదయాత్ర
--తిరుమల లో ప్రతి సంవత్సరం ఆగష్టు 1వ తేదీ న జరిగే అఖండ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం లో భాగస్వామ్యత
--బీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్ర నామ స్తోత్ర విరాట్ పారాయణం
--బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, అలివేలు మంగాపురం మరియు స్థానిక దేవాలయాలలో లక్ష్మీ , విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణములు
-- విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి టీటీడీ నిర్వహిస్తున్న "శుభప్రదం" అనే కార్యక్రమం రూపకల్పన లో నిర్వహణ లో శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు గురుతర బాధ్యతలు నిర్వహించినారు
-- "శ్రీవారి సేవ", "శుభప్రదం", పేరిట రెండు పుస్తకాలను శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు రచించగా టీటీడీ ముద్రించినది
--రామాయణ నవాహము, భాగవత సప్తాహముల నిర్వహణ
--శ్రీ రామ చంద్ర జీయర్ స్వామి వారు, తిరుపతి లో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగం లో, కీలక బాధ్యతలను శ్రీమతి హేమలత గారు నిర్వహించారు.
--చిత్తూరు జిల్లా వ్యాప్తముగా గ్రామాలలో భగవద్గీత ప్రచారం
--శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాల లో పంచమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం 40 వేల మందికి ఏర్పాటు చేసే అన్నదానం కార్యక్రంలో పంపిణీ బాధ్యతను 5 సంవత్సరాలు నిర్వహించాము.
--తిరుమల శ్రీవారి సేవ - నిత్యాన్నదానం, క్యూ నియంత్రణ
--కడప, నెల్లూరు జిల్లాల వరద బాధితులకు, తి.తి.దే నేతృత్వంలో ఫుడ్ ప్యాకెట్ల పంపిణి
--కరోనా సమయం లో బీద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ
--తిరుపతి లో కంచి మఠం వారు బీద విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, సాంప్రదాయ శిక్షణకు నెలకొల్పిన సాంప్రదాయ కళాశాలకు శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు బోధకుల ఎంపిక, సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు, కళాశాల గుర్తింపు విషయాలలో సేవలందించడం జరిగినది
ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు-
--లలిత సహస్ర నామ కోటి పారాయణములు
--నామ రామాయణం పారాయణములు
--హనుమాన్ చాలీసా పారాయణములు
శ్రీమతి నాదెళ్ల హేమలత గారు, శ్రీమతి Dr.సుధా వాణి గారు, శ్రీమతి అవధానుల ప్రసన్న లక్ష్మి గారు, "సౌందర్య లహరి" అనే మహిళా విభాగం ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
మన కుటుంబ క్షేమార్ధం, లోకకళ్యాణార్థం ఈ వెబ్సైటు ద్వారా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలలో మీరందరూ భాగస్వామ్యులై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము
ధర్మో రక్షతి రక్షితః
లోకా సమస్తా: సుఖినో భవంతు !!